ఈ ఫొటోలకు క్యాప్షన్ అక్కర్లేదు.. అటల్ సేతు ఫొటోలతో ఆనంద్ మహీంద్ర ట్వీట్
- ప్రారంభోత్సవానికి సిద్ధమైన అటల్ సేతు బ్రిడ్జి
- దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిగా రికార్డు
- శుక్రవారం ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- బైక్ లు, ఆటోలకు నో ఎంట్రీ, గరిష్ఠంగా 100 కి.మీ. స్పీడ్
అటల్ సేతుపైకి ఆటోలకు, బైక్ లకు ఎంట్రీ లేదని ముంబై పోలీసులు వివరించారు. ఈ బ్రిడ్జిపై వాహనాల వేగాన్ని గరిష్ఠంగా 100 కిలోమీటర్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. బ్రిడ్జి పైకి వెళ్లేందుకు, కిందికి దిగేందుకు ఏర్పాటు చేసిన మార్గాల వద్ద మాత్రం వాహనాలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని సూచించారు. బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతో ఈ రూల్స్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
బ్రిడ్జి విశేషాలు..
- దక్షిణ ముంబైని నవీ ముంబైతో కలుపుతూ 21.8 కిలోమీటర్ల పొడువుతో నిర్మాణం
- ఈ మార్గంలో దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైకి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు
- గతంలో ఇదే దూరానికి దాదాపు 2 గంటల సమయం పట్టేది
- ఆరు లేన్లతో సముద్రంపై 16.5 కి.మీ. నేలపై 5.3 కి.మీ. ఏర్పాటు
- 2018లో నిర్మాణ పనులు ప్రారంభం
- బ్రిడ్జి నిర్మాణానికి రూ.18 వేల కోట్ల ఖర్చు