Vyuham Movie: వ్యూహం సినిమా విడుదల... మరోసారి వాయిదాపడిన విచారణ

TS high Court adjourns hearings on vyuham film release petition
  • వ్యూహం సినిమాలో కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ కోర్టుకెక్కిన లోకేశ్
  • సినిమాపై కమిటీని వేసి రివ్యూ చేయాలన్న నారా లోకేశ్
  • వ్యూహం విడుదలకు ఎలాంటి కమిటీ అవసరం లేదన్న సినిమా యూనిట్
వ్యూహం చిత్రం విడుదలను నిర్ణయించేందుకు ఎలాంటి కమిటీ అవసరం లేదని సినిమా యూనిట్ తెలంగాణ హైకోర్టుకు బుధవారం తెలిపింది. ఈ సినిమాపై కమిటీని వేసి రివ్యూ చేయాలని అంతకుముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కమిటీ అవసరం లేదని చిత్ర నిర్మాతలు తాజాగా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా విడుదలపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా విడుదలపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లారు. సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వ్యూహం సినిమా విడుదలపై జాప్యం కొనసాగుతోంది.
Vyuham Movie
TS High Court
Ram Gopal Varma
Tollywood

More Telugu News