BRS: సీఎం రేవంత్ రెడ్డిపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

BRS MLCs complains against CM Revanth Reddy legislative council chairman
  • మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
  • సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు
  • కఠిన చర్యలు  తీసుకోవాలని మండలి చైర్మన్ కు వినతి
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు నేడు శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సురభి వాణీదేవి, ఎమ్మెస్ ప్రభాకర్ కలిశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. శాసనమండలిని ఇరానీ కేఫ్ గా అభివర్ణించారని, మండలి సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేశారని వారు పేర్కొన్నారు. ఈ మేరకు మండలి చైర్మన్ కు లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
BRS
Revanth Reddy
MLC
Legislative Council
Congress
Telangana

More Telugu News