K Narayana Swamy: మల్లు రవి ఫిర్యాదు... ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాద్ లో కేసు

Police case files on AP Dy CM Narayana Swamy in Hyderabad
  • సోనియాపై అవాస్తవాలు మాట్లాడారంటూ ఫిర్యాదు
  • నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలన్న మల్లు రవి
  • బేగం బజార్ పీఎస్ లో కేసు నమోదు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాదులో కేసు నమోదైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గురించి అసత్య వ్యాఖ్యలు చేశారంటూ మల్లు రవి బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

వైఎస్ మరణానికి కారణం సోనియా గాంధీ, చంద్రబాబేనని నారాయణస్వామి ఇటీవల షర్మిల కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మల్లు రవి తప్పుబట్టారు. 

ఉమ్మడి ఏపీ సీఎంగా వ్యవహరించిన వైఎస్సార్ కు సోనియా ఎంతో ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు సోనియా ప్రత్యేకంగా విమానాలు పంపించి వెతికించారని తెలిపారు.

ప్రతికూల వాతావరణం వల్లే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రహించాలని మల్లు రవి హితవు పలికారు. నారాయణస్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
K Narayana Swamy
Police Case
Hyderabad
Mallu Ravi
Sonia Gandhi
YSR
Telangana
Andhra Pradesh

More Telugu News