Vijay Devarakonda: వచ్చే నెలలో రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ పెళ్లి అంటూ వార్తలు.. అసలు నిజం ఇదే!

This is the fact in Rashminka Mandanna and Vijay Devarakonds marriage news
  • విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు
  • ఇద్దరి నిశ్చితార్థం జరగబోతోందంటూ కోడై కూస్తున్న సోషల్ మీడియా
  • ఆ వార్తల్లో నిజం లేదన్న విజయ్ టీమ్
టాలీవుడ్ ప్రేమ పక్షుల పెళ్లిళ్లు వరుసగా జరుగుతున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఫారిన్ టూర్లకు ఇద్దరూ కలిసి వెళ్లడం, ముంబైలో పాపరాజీల కెమెరాలకు చిక్కడం, డిన్నర్ పార్టీలకు కలిసి వెళ్తుండటంతో ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. 

ఈ క్రమంలో వీరిద్దరు వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నారని... త్వరలోనే నిశ్చితార్థ కార్యక్రమం జరగబోతోందనే వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తలను నమ్మొద్దని కోరింది.
Vijay Devarakonda
Rashmika Mandanna
Tollywood
Bollywood
Marriage
Love

More Telugu News