బీజేపీ నేతలు కేసీఆర్ ను కాపాడాలనుకుంటున్నారా?: జీవన్ రెడ్డి
- కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటూ కాంగ్రెస్ ఆరోపణలు
- న్యాయ విచారణను బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందన్న జీవన్ రెడ్డి
- బీజేపీ నేతల మాటల్లో కేసీఆర్ ను కాపాడాలన్న తాపత్రయం కనిపిస్తోందని వెల్లడి
హైదరాబాదులోని గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పారదర్శకత కోసమే తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని స్పష్టం చేశారు. అవసరమైతే సీబీఐ సాయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. కానీ బీఆర్ఎస్ పార్టీ న్యాయ విచారణకు అడ్డు తగిలే ప్రయత్నాలు చేస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు.