OG: పవన్ కల్యాణ్ 'ఓజీ' చేతులు మారిందంటూ ప్రచారం... స్పష్టతనిచ్చిన డీవీవీ ఎంటర్టయిన్ మెంట్

DVV Entertainment gives clarity on rumours about OG
  • పవన్ కల్యాణ్, సుజీత్ కలయికలో 'ఓజీ'
  • ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుందంటూ కథనాలు
  • డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ కు భారీ మొత్తం ఆఫర్ చేసిందని ప్రచారం
  • ఓజీ ఎప్పటికీ మాదే అంటూ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ ప్రకటన

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాహో దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఓజీ'. అయితే, ఈ సినిమా చేతులు మారిందని, ఈ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ భారీ మొత్తానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ కు ప్రాజెక్టును అప్పగించేసిందని కథనాలు వచ్చాయి. 

దీనిపై డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ స్పందించింది. "ఓజీ మాదే... ఓజీ ఎప్పటికీ మాదే" అంటూ స్పష్టత నిచ్చింది. పవన్ కల్యాణ్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎలా రూపుదిద్దుకుంటోంది అనే విషయంలో తమకు ఫుల్ క్లారిటీ ఉందని వెల్లడించింది. చిత్ర నిర్మాణం కొనసాగుతోందని, పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ ట్వీట్ చేసింది. "చిరుత బాగా ఆకలి మీద ఉంది... ఒక్కసారి వేటకు వచ్చిందంటే ఇంకేమీ మిగలదు" అంటూ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News