Keshineni Nani: నా కూతురు శ్వేత ఈ రోజు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది: కేశినేని నాని

My daughter Swetha will resign to TDP Primary Membership says Keshineni Nani
  • కార్పొరేటర్ పదవికి తన కూతురు రాజీనామా చేస్తుందని ప్రకటించిన విజయవాడ ఎంపీ
  • ఉదయం 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌కు వెళ్లి రిజైన్ చేస్తుందని వెల్లడి
  • ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసిన కేశినేని నాని

విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని మరో సంచలన ప్రకటన చేశారు. తన కూతురు శ్వేత ఈ రోజు (సోమవారం) కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తుందని ప్రకటించారు. ఉదయం 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి రాజీనామాను ఆమోదింప చేసుకుంటారని, ఆ మరుక్షణమే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఆయన ప్రకటించారు. చంద్రబాబుతో శ్వేత మాట్లాడుతున్న ఒక ఫొటోని ఆయన షేర్ చేశారు.

కాగా విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు కబురు పంపారని కేశినేని నాని మూడు రోజుల క్రితం అన్నారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్‌ని కలిసి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. ‘‘ నేను పార్టీకి అవసరంలేదని చంద్రబాబు నాయుడు గారు భావించిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం సబబు కాదనేది నా భావన’’ అంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా శ్వేత టీడీపీకి రాజీనామా చేస్తారని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News