Balakrishna: హిందూపురంలో ఓ పెళ్లి వేడుకకు హాజరైన బాలకృష్ణ

Balakrishna attends to a marriage in Hindupur
  • సొంత నియోజకవర్గానికి వచ్చిన బాలకృష్ణ 
  • ఓ టీడీపీ మైనారిటీ నేత ఇంట పెళ్లి
  • వధూవరులను ఆశీర్వదించిన బాలయ్య
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ సొంత నియోజకవర్గంలో పర్యటించారు. హిందూపురంలో ఓ టీడీపీ మైనారిటీ నేత ఇంట జరిగిన పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ముస్లిం టోపీ, కుర్తా, షేర్వానీ ధరించి వచ్చిన బాలకృష్ణ అందరినీ అలరించారు. బాలయ్య రాకతో పెళ్లింట సందడి రెట్టింపైంది. ముస్లింలు ఆయనకు ఆత్మీయ సత్కారం చేశారు. ఇక, వధూవరులను ఆశీర్వదించిన బాలయ్య... వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పెళ్లి వేడుకలో బాలకృష్ణను కలిసేందుకు స్థానిక నేతలు పోటీ పడ్డారు. బాలకృష్ణ వారిందరితోనూ మాట్లాడారు.
Balakrishna
Marriage
Hindupur
TDP
Andhra Pradesh

More Telugu News