Daggubati Purandeswari: "నా బీసీలు" అనే అర్హత సీఎం జగన్ కు లేదు: పురందేశ్వరి

Purandeswari take a jibe at CM Jagan
  • ఏపీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న పురందేశ్వరి
  • వైసీపీ పాలనలో బీసీలపై దాడులు జరుగుతున్నాయని విమర్శలు
  • బీసీలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని వ్యాఖ్యలు

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. వైసీపీ పాలనలో బీసీలపై దాడులు జరుగుతున్నాయని వెల్లడించారు. బీసీలకు ఇచ్చిన అనేక వాగ్దానాలను నెరవేర్చలేదని పురందేశ్వరి విమర్శించారు. "నా బీసీలు" అనే అర్హత సీఎం జగన్ కు లేదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ కమిషన్ కు  చట్టబద్ధత తీసుకువచ్చిందని పురందేశ్వరి ఉద్ఘాటించారు. బీజేపీ పేదల సేవ కోసమే అంకితమై ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News