సంగారెడ్డిలో కూలిన చర్చి.. నలుగురు కూలీలు దుర్మరణం
- నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం
- శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు కూలీలు
- సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్ లు
సంగారెడ్డి జిల్లా కోహీర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం నిర్మాణ పనులు జరుగుతుండగా చర్చి స్లాబ్ సడెన్ గా కుప్పకూలింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ నిర్మాణ కూలీలు నలుగురు చనిపోయారు. మరో నలుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.