Missing Girls: మిస్సయిన ఆ 26 మంది అమ్మాయిల గుర్తింపు.. ఇద్దరు అధికారులు సస్పెండ్

All 26 girls missing from Bhopal shelter home located
  • భోపాల్ శివారులోని పర్వాలియాలోని గర్ల్స్ హాస్టల్ నుంచి మిస్సయిన అమ్మాయిలు
  • ఎస్‌సీపీసీఆర్ చైర్మన్ ప్రియాంక ఆకస్మిక సందర్శనతో వెలుగులోకి
  • మిస్సయిన అమ్మాయిలు వేర్వేరు ప్రాంతాల్లో గుర్తింపు

భోపాల్‌ శివారులోని పర్వాలియాలోని ఆంచల్ గర్ల్స్ హాస్టల్‌ నుంచి కనిపించకుండా పోయిన 26 మంది బాలికలను శనివారం పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (సీడీపీవో) అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. మిస్సయిన 10 మంది అమ్మాయిలను అదమ్‌పూర్ చావ్ని ప్రాంతంలో గుర్తించగా, 13 మందిని ముురికివాడల్లో, ఇద్దరిని టాప్ నగర్‌లో, ఒకరిని రాయ్‌సెన్‌లో గుర్తించారు. 

చిల్డ్రన్ హోం నుంచి బాలికలు మిస్సయిన విషయం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎస్‌సీపీసీఆర్) చైర్మన్ ప్రియాంక కనుంగో ఆకస్మిక సందర్శనతో బయటపడింది. 68 మంది బాలికలు ఉండాల్సిన చోట 26 మంది అమ్మాయిలు కనిపించకుండా పోవడాన్ని గుర్తించారు. వీరందరూ గుజరాత్, ఝార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందినవారే. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇద్దరు సీడీపీవో అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News