third umpire: ఒక బటన్ నొక్కబోయి మరొకటి ప్రెస్ చేసిన థర్డ్ అంపైర్.. బ్యాట్స్‌మెన్ ఔట్‌

The third umpire pressed one button and pressed another in Big bash league
  • రనౌట్‌ని పరిశీలించి నాటౌట్‌కు బదులు ఔట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్
  • వెంటనే గుర్తించి సవరించుకున్న వైనం
  • ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో ఆసక్తికర ఘటన
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 2023-24లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. థర్డ్ అంపైర్ నాటౌట్ ప్రకటించబోయి తప్పుగా ఔట్ ప్రకటించాడు. ఒక బటన్ నొక్కడానికి బదులు మరొకటి నొక్కడంతో ఈ ఘటన జరిగింది. అయితే వెంటనే పొరపాటుని గుర్తించి సవరించుకున్నారు. సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

సిడ్నీ సిక్సర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జేమ్స్ విన్స్ బంతిని స్ట్రైట్‌గా ఆడాడు. దీంతో బాల్ బౌలర్ ఇమాద్ వసీం చేతిని తాకి వికెట్లకు తగిలింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు రనౌట్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో జోష్ ఫిలిప్ క్రీజులో ఉండడంతో నాటౌట్‌గా తేలింది. అయితే మైదానంలోని భారీ స్క్రీన్‌పై ఔట్‌గా థర్డ్ అంపైర్ ప్రకటించారు. దీంతో కొద్దిసేపు  గందరగోళం నెలకొంది. అయితే పొరపాటు జరిగిందని ఫీల్డ్ అంపైర్‌కు థర్డ్ అంపైర్ తెలియజేశారు. వెంటనే నిర్ణయాన్ని సవరించారు. దీనిపై మైదానంలోని ఆటగాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సిడ్నీ సిక్సర్స్‌పై మెల్‌బోర్న్ స్టార్స్ విజయం సాధించింది.
third umpire
Wrong Button
Big Bash League
Cricket

More Telugu News