Ambati Rayudu: అంబటి రాయుడికి ఆల్ ది బెస్ట్ చెప్పిన టీడీపీ

TDP response on Ambati Rayudu resignation to YSRCP
  • వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు
  • రాయుడు నిర్ణయంపై ఎక్స్ వేదికగా స్పందించిన టీడీపీ
  • జగన్ తో కలిసి పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉందన్న టీడీపీ
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి షాక్ ఇచ్చారు. వైసీపీలో చేరి 10 రోజులు కూడా తిరక్కుండానే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని... కొంత కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని ఈరోజు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాయుడు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ స్పందించింది. జగన్ లాంటి విపరీత ధోరణి ఉన్న వ్యక్తితో కలిసి మీరు రాజకీయ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉందని టీడీపీ ట్వీట్ చేసింది. మీ భవిష్యత్తు ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.  

Ambati Rayudu
YSRCP
Telugudesam

More Telugu News