Chandrababu: కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ను సందర్శించిన చంద్రబాబు

Chandrababu visits Anna Camteen run by Ugra Narasimha Reddy in Kanigiri
  • ప్రకాశం జిల్లా కనిగిరిలో చంద్రబాబు పర్యటన
  • నిన్న రా కదలిరా సభకు హాజరు
  • నేడు రెండో రోజు అన్న క్యాంటీన్ లో సందడి చేసిన టీడీపీ అధినేత
టీడీపీ అధినేత చంద్రబాబు కనిగిరిలో పర్యటిస్తున్నారు. ఇవాళ రెండో రోజు పర్యటన సందర్భంగా చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ను సందర్శించారు. 

పేదలకు భోజనం అందించే అన్న క్యాంటీన్ ను కొనసాగిస్తుండడంపై చంద్రబాబు నిర్వాహకులను అభినందించారు. అంతేకాదు, స్వయంగా పలువురికి భోజనం వడ్డించారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఉగ్రనరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్ వంటి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కూడా ఉన్నారు. అన్న క్యాంటీన్ సందర్శన సందర్భంగా అక్కడి వంటవాళ్లతోనూ చంద్రబాబు మాట్లాడారు. అన్న క్యాంటీన్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు.
Chandrababu
Anna Canteen
Ugra Narasimha Reddy
Kanigiri
TDP
Prakasam District

More Telugu News