కొడాలి నాని ఏ దేశానికి వెళ్లినా వదిలిపెట్టరు: బుద్దా వెంకన్న
- వైసీపీలో గుర్తింపు ఉన్న ఒక్క బీసీ నేత కూడా లేరన్న బుద్దా వెంకన్న
- వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడికి శుభాకాంక్షలు తెలిపిన వైనం
- తిరువూరు సభకు విజయవాడ నుంచి ర్యాలీగా వెళతామని వెల్లడి
తమ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేస్తే 100 దేశాల్లో ఆందోళన చేశారని... వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఏ దేశానికి వెళ్లినా వదలిపెట్టరని వెంకన్న అన్నారు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆడుదాం ఆంధ్రకు బ్యాట్ పట్టుకుని వచ్చారని... జగన్ సైకో అనే విషయం అర్థం కావడంతో పార్టీలో చేరిన వారానికే రాజీనామా చేశారని చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసినందుకు రాయుడికి శుభాకాంక్షలు తెలిపారు.
విజయవాడ పశ్చిమ అభ్యర్థి ఎవరైనా గానీ... అందరం కలిసి ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని వెంకన్న చెప్పారు. తిరువూరులో జరిగే చంద్రబాబు సభకు విజయవాడ నుంచి ర్యాలీగా వెళతామని తెలిపారు. తిరువూరు సభ నిర్వహణపై విజయవాడ వెస్ట్ నేతల సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.