jupalli krishn rao: తెలంగాణను బీఆర్ఎస్ అప్పులకుప్పగా మార్చింది: జూపల్లి కృష్ణారావు

Jupalli Krishna Rao blames BRS for telangana debts
  • పదేళ్ళ కాలంలో రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల్లో ముంచిందని ఆరోపణలు
  • గ్రామాలు, తండాలలో కనీసం సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం
  • తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు హామీలు అమలు చేశామన్న జూపల్లి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించారు. జూపల్లి శనివారం నాడు జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల్లో ముంచిందని ఆరోపించారు. ఈ పదేళ్ల పాలనలో గ్రామాలు, తండాలలో కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఇక్కడి ఎల్లారం తండాకు ఇప్పటి వరకు కనీసం ఎమ్మెల్యే, ఎంపీ రాలేదన్నారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని గుర్తు చేశారు. వంద రోజుల్లో మొత్తం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.
jupalli krishn rao
Telangana
BRS
Congress

More Telugu News