Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన వేల్స్ యూనివర్సిటీ... సున్నితంగా తిరస్కరించిన జనసేనాని!

Vels University announces doctorate to Pawan Kalyan
  • పవన్ కల్యాణ్ సామాజిక సేవలను గుర్తించిన వేల్స్ యూనివర్సిటీ
  • జనవరిలో 14వ స్నాతకోత్సవానికి రావాలంటూ పవన్ కు ఆహ్వానం
  • చెన్నైకి చెందిన వేల్స్ వర్సిటీ ఆహ్వానాన్ని తిరస్కరించిన పవన్
  • తనకంటే  గొప్పవాళ్లు ఉన్నారని, వారికి డాక్టరేట్ ఇవ్వాలని సూచన

జనసేనాని పవన్ కల్యాణ్ కు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. గతంలో పవన్ చేసిన సామాజిక సేవలకు గాను ఈ డాక్టరేట్ ఇస్తున్నట్టు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ తెలిపింది. ఈ నెలలో జరిగే తమ 14వ స్నాతకోత్సవానికి హాజరై, డాక్టరేట్ అందుకోవాలని వర్సిటీ వర్గాలు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించాయి. 

అయితే, వేల్స్ యూనివర్సిటీ ఆహ్వానాన్ని పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించారు. తనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించడం సంతోషం కలిగించే అంశమే అయినా, తనకంటే గొప్పవారు చాలామంది ఉన్నారని, అలాంటివాళ్లను గుర్తించి వారికి డాక్టరేట్ ఇవ్వడం సబబుగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ వేల్స్ యూనివర్సిటీ యాజమాన్యానికి లేఖ రాశారు. 

అంతేకాదు, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున... రాజకీయ కార్యక్రమాలతో తాను బిజీగా ఉన్నానని, యూనివర్సిటీ స్నాతకోత్సవానికి తాను హాజరుకాలేకపోతున్నానని లేఖలో తెలిపారు.

  • Loading...

More Telugu News