Christian Oliver: సముద్రంలో కూలిన విమానం.. హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ దుర్మరణం

Hollywood Actor Christian Oliver His 2 Daughters Killed In Plane Crash
  • కరీబియన్ సముద్రంలో గురువారం కూలిన విమానం
  • విమానంలో ప్రయాణిస్తున్న నటుడు ఓలివర్, ఆయన కుమార్తెలు, పైలట్ దుర్మరణం
  • విహార యాత్రకు బయలుదేరిన సమయంలో దుర్ఘటన
  • మృతదేహాలను వెలికి తీసిన కోస్ట్‌గార్డ్
హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ గురువారం విమాన ప్రమాదంలో మృతి చెందారు. తన ఇద్దరు కూతుళ్లతో (10, 12 ఏళ్ల వయసున్న బాలికలు) కలిసి ఆయన ప్రయాణిస్తున్న విమానం కరీబియన్ సముద్రంలో కూలడంతో అందరూ మరణించారు. ఈ మేరకు సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీన్స్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. 

ఘటన సమాచారం అందగానే విమానం కూలిన ప్రాంతానికి చేరుకున్న జాలరులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో విమానం పైలట్ కూడా కన్నుమూశారు. విహార యాత్ర కోసం ఓలివర్.. బెకియా నుంచి బయలుదేరాక ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ చేసిన కొద్ది సేపటికే విమానం సముద్రంలో కూలిపోయింది. 

జర్మనీ సంతతికి చెందిన ఓలివర్ తన కెరీర్‌లో 60కి పైగా సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. ప్రముఖ నటుడు టామ్ క్రూయిజ్ నటించిన వాల్కరీ మూవీలోనూ ఓ చిన్న పాత్ర పోషించారు. కెరీర్‌ ఆరంభంలో ఆయన సేవ్డ్ బై ది బెల్, ది న్యూ క్లాస్, బేబీ సిట్టర్స్ క్లబ్‌ సీరియళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పాప్యులర్ షో అలారమ్ ఫర్ కోబ్రా 11లోనూ ఆయన రెండు సీజన్లలో నటించారు.
Christian Oliver
Hollywood
Plane Crash

More Telugu News