sajjanar: సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

  • సంక్రాంతి పండుగ సందర్భంగా సజ్జనార్ సమీక్ష
  • పండుగ కోసం 4,484 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సజ్జనార్ వెల్లడి
  • ఇందులో 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్న సజ్జనార్
RTC MD Sajjanar on free bus to women in special buses

సంక్రాంతి పర్వదినం సందర్భంగా దాదాపు నాలుగున్నర వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం తెలిపారు. ఈ బస్సులలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పండుగ కోసం 4,484 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఇందులో 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఇక ఈ ప్రత్యేక బస్సులలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

More Telugu News