BRS: బీఆర్ఎస్‌లో బయటపడిన వర్గపోరు... ఎమ్మెల్సీ-మాజీ ఎమ్మెల్యే అనుచరుల మధ్య వాగ్వాదం

Differences in Chevella BRS
  • తెలంగాణ భవన్‌లో లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు
  • సమావేశంలో మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం
  • సర్దిచెప్పిన మాజీ మంత్రి హరీశ్ రావు
బీఆర్ఎస్‌లో వర్గపోరు బయటపడింది. చేవెళ్లలో ఇద్దరు ముఖ్య నాయకుల అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా శుక్రవారం తెలంగాణ భవన్‌లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమయంలో వర్గపోరు బయటపడింది.

సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహేందర్ రెడ్డి మాట్లాడే సమయంలో రోహిత్ రెడ్డి వర్గం పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం తలెత్తింది. మాజీ మంత్రి హరీశ్ రావు కలుగజేసుకొని ఇరువురికి సర్ది చెప్పవలసి వచ్చింది.
BRS
chevella
Telangana

More Telugu News