YS Sharmila: ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో షర్మిల భేటీ

YS Sharmila meets Mallikarjun Kharge
  • ఖర్గే నివాసానికి వెళ్లిన షర్మిల
  • కుమారుడి వివాహానికి ఆహ్వానం
  • ప్రస్తుత రాజకీయాలపై చర్చలు
నిన్న కాంగ్రెస్ లో చేరిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఈరోజు ఆమె కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా ఎలా ముందుకు తీసుకెళ్లాలి, పార్టీని ఎలా బలపరచాలనే దానిపై ఖర్గే నుంచి గైడెన్స్ తీసుకున్నానని భేటీ అనంతరం షర్మిల తెలిపారు.

తనకు అప్పగించబోయే బాధ్యతలపై చర్చలు జరుగుతున్నాయని... ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆమె చెప్పారు. ఏ బాధ్యతలను ఇచ్చినా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కూడా షర్మిల కలిశారు. కుమారుడి వెడ్డింగ్ కార్డును ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు.
YS Sharmila
Mallikarjun Kharge
Congress

More Telugu News