Chandrababu: 'జయహో బీసీ' ప్రచార రథాలను ప్రారంభించిన చంద్రబాబు

Chandrababu launches Jayaho BC vehicles
  • జయహో బీసీ కార్యాచరణ చేపట్టిన టీడీపీ
  • 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 25 ప్రచార రథాలు
  • జెండా ఊపిన చంద్రబాబు 

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ 'జయహో బీసీ' ప్రచార రథాలను ప్రారంభించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వాహనాలకు జెండా ఊపారు. జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రచార రథాల ద్వారా 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నది టీడీపీ ప్రణాళిక. 

అటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బీసీ నేతలు పర్యటించి... బీసీలకు టీడీపీ గతంలో ఏం చేసింది, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతోంది అని వివరించనున్నారు.

జయహో బీసీ' ప్రచార రథాలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వాటిపై టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ బొమ్మ, అధినేత చంద్రబాబు బొమ్మ, ఇతర అగ్రనేతల బొమ్మలు, ప్రముఖ సంఘ సంస్కర్త, అణగారిన కులాల ఆశాజ్యోతి జ్యోతిరావ్ ఫూలే బొమ్మను ముద్రించారు. 

  • Loading...

More Telugu News