Jagan: తల్లి విజయమ్మను కలిసిన అనంతరం బయల్దేరిన జగన్.. ముగిసిన హైదరాబాద్ పర్యటన

Jagan Hyderabad trip ended
  • కేసీఆర్ తో 45 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరిపిన జగన్
  • లోటస్ పాండ్ లో తన తల్లిని కలిసిన సీఎం
  • లోటస్ పాండ్ నుంచి ఎయిర్ పోర్టుకు పయనం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. ఉదయం హైదరాబాద్ కు వచ్చిన వెంటనే ఆయన నేరుగా మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారు. కేసీఆర్ ను పరామర్శించిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న ఎన్నికలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తో చర్చలు ముగిసిన వెంటనే ఆయన లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లారు. తన తల్లి విజయమ్మతో అరగంట సేపు మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వీరి కలయిక ఆసక్తికరంగా మారింది. తల్లితో సమావేశం తర్వాత ఆయన బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. 
Jagan
YSRCP
KCR
BRS
YS Vijayamma

More Telugu News