TSRTC: రేపటి నుంచి తెలంగాణలో అద్దెబస్సుల సమ్మె.. ఉచిత ప్రయాణానికి దెబ్బ!

TSRTC Rent Bus Drivers Going To Strike From Tomorrow
  • రద్దీ పెరగడం వల్ల బస్సులు పాడవుతున్నాయని ఆందోళన
  • కేఎంపీఎల్ పడిపోయిందంటున్న అద్దె బస్సు యజమానులు
  • డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కరవు
  •  సమ్మెకు వెళ్లేందుకే నిర్ణయం

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత ఆర్టీసీలోని అద్దెబస్సుల యజమానులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రయాణికుల రద్దీ పెరగడం, సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కుతుండడం వల్ల బస్సులు పాడవుతున్నాయని, కేఎంపీఎల్ పడిపోయిందని, ఫలితంగా బస్సుల నిర్వహణ భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.

సమస్యలు పరిష్కరించకుంటే జనవరి 5 నుంచి సమ్మెకు వెళ్తామని ప్రకటించారు. వారి డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోవడంతో ముందుగా హెచ్చరించినట్టుగానే రేపటి నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. అదే జరిగితే, బస్సుల కొరతతో ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. 

రాష్ట్రంలో మొత్తం 2,700 అద్దె బస్సులు నడుస్తుండగా ఒక్క హైదరాబాద్‌లోనే 300 బస్సులు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో రోజుకు సగటున 30 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. నిన్నటి వరకు 6.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు.

  • Loading...

More Telugu News