Jagan: హైదరాబాద్ కు బయల్దేరిన సీఎం జగన్

CM Jagan leaves to Hyderabad to meet KCR
  • కేసీఆర్ ను పరామర్శించనున్న జగన్
  • బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లనున్న సీఎం
  • మధ్యాహ్నం విజయవాడకు తిరుగుపయనం 
ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్ పరామర్శించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి జగన్ నేరుగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం ఆయన బేగంపేటకు చేరుకుని విజయవాడకు తిరుగుపయనమవుతారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. కేసీఆర్ తో జగన్ సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు పలు విషయాలపై చర్చించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Jagan
YSRCP
KCR
BRS

More Telugu News