Chandrababu: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu comments on Sharmila joining Congress
  • నేడు కాంగ్రెస్ లో చేరుతున్న వైఎస్ షర్మిల
  • జగనన్న వదిలిన బాణం రివర్స్ లో తిరుగుతోందన్న చంద్రబాబు
  • చెల్లి నిర్ణయంతో జగన్ సీఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్య
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయబోతున్నారు. ఆమెకు ఏపీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగనన్న వదిలిన బాణం... ఇప్పుడు రివర్స్ లో తిరుగుతోందని అన్నారు. తెలంగాణ మాదిరి ఏపీలో కూడా కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభావం వైసీపీపై పడుతుందని అన్నారు. చెల్లి నిర్ణయంతో జగన్ సీఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తల్లి, చెల్లి వ్యవహారాన్ని జగనే చూసుకోవాలని అన్నారు.
Chandrababu
Telugudesam
YS Sharmila
YSRTP
Jagan
YSRCP

More Telugu News