లిఫ్ట్ అడిగి కారెక్కి.. డబ్బులు ఇవ్వకుంటే డ్రైవర్‌పై వేధింపుల కేసు పెడతానని బెదిరింపు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
- కారు కొద్ది దూరం వెళ్లగానే డబ్బులు డిమాండ్ చేసిన నిందిత మహిళ
- డబ్బులు ఇవ్వకుంటే లైగింక వేధింపుల కేసు పెడతానని బెదిరింపులు
- కారును నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన బాధిత డ్రైవర్
- నిందిత మహిళపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదు
బంజారాహిల్స్ రేషంబాగ్ ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ పరమానందకు మంగళవారం రాత్రి ఈ ఘటన ఎదురైంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి కేబీఆర్ పార్క్ వైపు కారులో వెళ్తుండగా చెక్‌పోస్టు వద్ద ఓ మహిళ లిఫ్టు అడిగిందని డ్రైవర్ తెలిపాడు. ఆమెను కారులో ఎక్కించుకొని కొద్ది దూరం వెళ్లాక డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిందని, లేదంటే లైంగిక దాడికి పాల్పడ్డానంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించిందని వివరించాడు. కాగా బంజారా హిల్స్‌లో ఇటీవలే ఈ తరహా ఘటన ఒకటి నమోదయ్యింది. ముఖానికి మాస్క్ ధరించి లిఫ్ట్ అడిగి వాహనం ఎక్కిన ఓ మహిళ డ్రైవర్‌ను డబ్బులు డిమాండ్ చేసింది. డబ్బు ఇవ్వకుంటే లైంగికంగా వేధించావంటూ ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ఈ ఘటనలో మహిళను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.