Sharmila: తన కుమారుడి వివాహానికి సీఎం జగన్‌కు షర్మిల ఆహ్వానం

YSRTP president Sharmila invites jagan to her sons wedding
  • కడప నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల
  • సీఎం జగన్‌కు తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత
  • షర్మిల వెంట భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డి 
తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సీఎం జగన్‌ను వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆహ్వానించారు. భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి షర్మిల కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన సోదరుడు సీఎం జగన్ నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. 

కాగా, వైఎస్ షర్మిలతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా వెళ్లారు. అయితే, షర్మిల కాన్వాయ్ వెళ్లిన కాసేపటికి ఆయన క్యాంపు ఆఫీసుకు రావడంతో పోలీసులు ఆయనను సీఎం నివాసం వైపు వెళ్లకుండా ఆపేశారు. కాసేపటికి ఆదేశాలు రావడంతో సీఎం నివాసంలోకి పంపించారు. గన్నవరం నుంచి వస్తుండగా ట్రాఫిక్‌లో తన వాహనం చిక్కుకుపోవడంతో షర్మిల వెంట రాలేకపోయానని ఆయన చెప్పారు.
Sharmila
Jagan
YSRCP
YSRTP

More Telugu News