Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

IPS reshuffle in telangana
  • 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
  • సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వీవీ శ్రీనివాసరావు నియామకం
  • పోలీసు నియామక బోర్డు చైర్మన్‌గా అదనపు బాధ్యతల అప్పగింత
తెలంగాణ ప్రభుత్వం 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వీవీ శ్రీనివాసరావును నియమించింది. పోలీసు నియామక బోర్డు చైర్మన్‌గా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించింది. కో-ఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్, మహిళా భద్రతా విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి, రాజేంద్ర నగర్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా ఆర్ వెంకటేశ్వర్లు, రామగుండం సీపీగా ఎల్ ఎస్ చౌహాన్, ఎల్బీ నగర్ డీసీపీగా సీహెచ్ ప్రవీణ్ కుమార్, టీఎస్ ట్రాన్సుకో ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, మాదాపూర్ డీసీపీగా జీ వినీత్‌లకు బాధ్యతలు అప్పగించారు.
Telangana
ips

More Telugu News