Sankranti: సంక్రాంతికి ఆరు రోజులు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Government announce holidays for Sankranthi
  • జనవరి 12 నుంచి 17 వరకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  • ప్రకటన విడుదల చేసిన డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్
  • మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి సెలవులు ప్రకటించింది. పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటన విడుదల చేసింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.  

13వ తేదీన రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం అవుతోంది. ఇదే రోజున భోగి వచ్చింది. 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ వున్నాయి. 17వ తేదీన పాఠశాలలకు ప్రభుత్వం అదనంగా సెలవును ప్రకటించింది. రెండో శనివారం, ఆదివారం కలిపి మొత్తం ఆరు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. 18వ తేదీన అన్ని విద్యాసంస్థలు యథావిధిగా తెరుచుకోనున్నాయి.
Sankranti
Makar Sankranti
Telangana
school

More Telugu News