Satya Kumar: జగన్ అసమర్థతను, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని ఎత్తి చూపుతాం: సత్య కుమార్

Satya Kumar fires on Jagan
  • ఏపీ అభివృద్ధికి ప్రధాని ఎంతో సహకరించారన్న సత్య కుమార్
  • కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకుంటున్నారని విమర్శ
  • జగన్ ప్రజల మధ్యకు రాలేకపోతున్నారని ఎద్దేవా

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం ప్రధాని ఎంతో సహకరించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పై ఎలాంటి వివక్ష చూపకుండా అనేక పథకాలను అందించారని అన్నారు. కేంద్ర పథకాలకు వైసీపీ ప్రభుత్వం స్లిక్కర్లు వేసుకుంటున్నారని... దీన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. సీఎం జగన్ అసమర్థతను, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నామని... పొత్తుల గురించి తర్వాత మాట్లాడతామని అన్నారు. ఎన్నికల ముందు మాయదారి మాటలు చెప్పిన జగన్... ఇప్పుడు ప్రజల మధ్యకు కూడా రాలేకపోతున్నారని చెప్పారు. వైసీపీ నేతలు పోలీసులు, వాలంటీర్లు లేకుండా బయటకు రాలేకపోతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News