అయోధ్య రామమందిరం ఆహ్వానపత్రిక ఇదే.. వెలుగులోకి వచ్చిన కార్డును మీరూ చూడండి!
- ఈ నెల 22న ఆయోధ్య రామాలయ ప్రారంభం
- ప్రధాని మోదీ సహా దేశవ్యాప్తంగా ఆరు వేల మంది అతిథులకు ఆహ్వానాలు
- కార్డు అద్భుతంగా ఉందంటూ నెటిజన్ల ప్రశంసలు
- ఆహ్వానపత్రిక చూసి తన్మయత్వం
అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మొత్తం 6 వేల మంది అతిథులను ఆహ్వానిస్తూ శ్రీరాం తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్డులు పంపించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా దేశం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.