Dadi Veerabhadra Rao: నేడు టీడీపీలో చేరనున్న దాడి వీరభద్రరావు.. చంద్రబాబుతో అపాయింట్ మెంట్ ఫిక్స్

Dadi Veerabhadra Rao to meet Chandrababu today
  • నిన్న వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు
  • 2014 వరకు టీడీపీలో కీలకంగా వ్యవహరించిన దాడి
  • 1995లో టీడీపీ సంక్షోభం తర్వాత చంద్రబాబు వైపు వచ్చిన దాడి
సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు నిన్న వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు కుమారులతో కలిసి ఆయన తన సొంత గూడు టీడీపీలోకి చేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన అపాయింట్ మెంట్ ఖరారయింది. ఈరోజు చంద్రబాబును ఆయన కలవనున్నారు. ఈ సందర్భంగా తన కుమారులు, అనుచరులతో కలిసి టీడీపీ కండువా కప్పుకోనున్నారు. 2014 వరకు దాడి వీరభద్రరావు టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పని చేశారు. 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ వైపు దాడి ఉన్నారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబు వైపు వచ్చారు. చంద్రబాబు పక్షాన చేరిన తర్వాత ఆయన పార్టీలో కీలక పాత్రను పోషించారు. ఈ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన టీడీపీని వీడారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు.
Dadi Veerabhadra Rao
Chandrababu
Telugudesam

More Telugu News