Ponnam Prabhakar: ప్రజాపాలన దరఖాస్తుల గడువు పొడిగింపుపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ

Minister ponnam Prabhakar clarity on praja palana application forms
  • ప్రజాపాలన దరఖాస్తుల గడువు పొడిగింపు ఉండదని స్పష్టీకరణ
  • జనవరి 6వ తేదీ లోపు అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచన
  • అభయహస్తం దరఖాస్తులపై రాజకీయాలు చేయడమేమిటని ప్రశ్న
ప్రజాపాలన దరఖాస్తుల గడువు పొడిగింపుపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టతనిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజాపాలన దరఖాస్తుల గడువు పొడిగింపు ఉండదని తేల్చి చెప్పారు. జనవరి 6వ తేదీలోపు మాత్రమే అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులపై రాజకీయాలు చేయడం ఏమిటి? అని మండిపడ్డారు. ప్రజాపాలన దరఖాస్తులను గత డిసెంబర్ 28 తేదీ నుంచి స్వీకరిస్తున్నారు. మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఆటో డ్రైవర్లు ఎవరూ కూడా బీఆర్ఎస్ ట్రాప్‌లో పడవద్దని సూచించారు.
Ponnam Prabhakar
Telangana
BRS

More Telugu News