Ponnam Prabhakar: కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar hot comments on kishan Reddy
  • కిషన్ రెడ్డి... కేసీఆర్ బినామీ అంటూ విమర్శలు
  • మజ్లిస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న మంత్రి పొన్నం
  • జ్యుడిషియల్ విచారణకు బీజేపీ సహకరించాలని విజ్ఞప్తి
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కిషన్ రెడ్డి బినామీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యుడిషియల్ విచారణ పేరుతో కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడుతోందన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలకు పొన్నం మంగళవారం సాయంత్రం తీవ్రంగా స్పందించారు. అసలు కిషన్ రెడ్డియే కేసీఆర్‌కు బినామీ అని... మజ్లిస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని విమర్శించారు.

తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యం అన్నారు. జ్యూడిషియల్ విచారణకు బీజేపీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చాలా కేసుల్లో కేసీఆర్‌ను బీజేపీ కాపాడిందని ఆరోపించారు. ఇన్నేళ్లుగా కేసీఆర్, ఆయన కుటుంబంపై విచారణ ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. కేసీఆర్‌ను మళ్లీ కాపాడేందుకే కిషన్ రెడ్డి సీబీఐ విచారణ అంటున్నారని విమర్శలు గుప్పించారు.
Ponnam Prabhakar
G. Kishan Reddy
BJP

More Telugu News