TTD EO: పురావస్తు శాఖకు లేఖ రాయడానికి కారణం ఇదే: టీటీడీ ఈవో ధర్మారెడ్డి

  • అలిపిరి మంటపాల పునర్నిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నారన్న ధర్మారెడ్డి
  • మంటపం ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితిలో ఉందని వెల్లడి
  • మంటపాన్ని కూల్చే విషయంపై పురావస్తు శాఖకు లేఖ రాశామని ధర్మారెడ్డి
TTD EO Dharma Reddy on Alipiri Mantapam

తిరుమల, తిరుపతిలో టీటీడీ చేస్తున్న మంటపాల పునర్నిర్మాణ కార్యక్రమం విమర్శలపాలు అవుతోంది. ఈ చర్యలపై ఇప్పటికే విపక్ష నేతలు టీటీడీని టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ... అలిపిరి మంటపాల పునర్నిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పాదాల మంటపం ఇంతరకు పురావస్తుశాఖ పరిధిలో లేదని... అది ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితిలో ఉందని చెప్పారు. 

పలుమార్లు ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ను సంప్రదించినప్పటికీ స్పందన లేదని ధర్మారెడ్డి తెలిపారు. అందుకే మంటపాన్ని కూల్చే విషయంపై పురావస్తు శాఖకు లేఖ రాశామని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న పాదాల మంటపంపై రాజకీయాలు చేస్తూ భక్తుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. టీటీడీ వద్ద శిల్పకళ, ఆలయాల నిర్మాణాలకు సంబంధించిన అన్ని విభాగాలు ఉన్నాయని చెప్పారు. జనవరి 1వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని తెలిపారు. మొత్తం 6,47,452 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని చెప్పారు.

More Telugu News