Atchannaidu: ఒక్కొక్కరికి రూ. 30 వేలు ఎగనామం పెట్టారు: అచ్చెన్నాయుడు

Atchannaidu fires on Jagan
  • అబద్ధాల పునాదులపై జగన్ బతుకుతున్నారన్న అచ్చెన్న
  • టీడీపీ హయాంలో పెన్షన్ ను రూ. 1800 పెంచామని వ్యాఖ్య
  • జగన్ హయాంలో పెరిగింది రూ. 750 మాత్రమేనని విమర్శ

అబద్ధాల పునాదులపై ముఖ్యమంత్రి జగన్ బతుకుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రూ. 3 వేల పెన్షన్ హామీపై అధికారంలోకి రాగానే జగన్ మాట తప్పారని చెప్పారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ. 30 వేల ఎగనామం పెట్టారని దుయ్యబట్టారు. నిజాలు మాట్లాడితే తల వేయి ముక్కలు అవుతుందనే శాపం జగన్ ను భయపెడుతోందని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో తమ అధినేత చంద్రబాబు రూ. 200ల పెన్షన్ ను రూ. 1,800 పెంచి రూ. 2 వేలు చేశారని చెప్పారు. జగన్ హయాంలో పెంచింది కేవలం రూ. 750 మాత్రమేనని అన్నారు. చంద్రబాబు హయాంలో కొత్తగా 20 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. జగన్ చెప్పే అబద్ధాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు.

  • Loading...

More Telugu News