Kakinada Subbaiah Gari Hotel: షిరిడీలో 'కాకినాడ సుబ్బయ్య గారి హోటల్' ప్రారంభం... హాజరైన రఘురామకృష్ణరాజు, పట్టాభి

Raghurama and Pattabhi attend hotel inauguration in Shirdi
  • కాకినాడలో 1950లో ప్రారంభమైన 'సుబ్బయ్య గారి హోటల్'
  • నేడు దేశంలో అనేక నగరాలకు విస్తరించిన వైనం
  • ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీలోనూ బ్రాంచి తెరిచిన నిర్వాహకులు

ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీలో తెలుగు రాజకీయవేత్తలు సందడి చేశారు. షిరిడీలో 'కాకినాడ సుబ్బయ్య గారి హోటల్' ప్రారంభోత్సవంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రఘురామ సతీసమేతంగా విచ్చేశారు. రఘురామ దంపతులను హోటల్ యాజమాన్యం సత్కరించింది. దీనికి సంబంధించిన ఫొటోలను రఘురామ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

కాకినాడ కేంద్రంగా 1950లో ప్రారంభమైన 'సుబ్బయ్య హోటల్'... నేడు దేశంలో అనేక చోట్ల బ్రాంచిలు కలిగి ఉంది. 2018లో హైదరాబాదులో 'కాకినాడ సుబ్బయ్య గారి హోటల్' పేరిట మొదటి బ్రాంచి ప్రారంభం కాగా... అక్కడ్నించి దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించింది. 

'కాకినాడ సుబ్బయ్య గారి హోటల్' లో ప్రత్యేకంగా వండే పనసపొట్టు బిర్యానీ ఎంతో ఫేమస్. ఇక్కడ అరటి ఆకులతో చేసిన బుట్టలలో ఆహార పదార్థాలను ఉంచి కస్టమర్లకు వడ్డిస్తారు. ఇది శాకాహార హోటల్.

  • Loading...

More Telugu News