Vishnu Kumar Raju: చరిత్రలో చెత్త సీఎంగా జగన్ నిలిచిపోయారు: విష్ణుకుమార్ రాజు

Jagan remained as worst CM in history says Vishnu Kumar Raju
  • మూడు నెలల్లో ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయన్న విష్ణుకుమార్ రాజు
  • రాష్ట్రాన్ని జగన్ అన్ని విధాలా నాశనం చేశారని విమర్శ
  • టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్య
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20కి మించి సీట్లు రావని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని... ఆ తర్వాత రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని అన్నారు. రాష్ట్రాన్ని జగన్ అన్ని విధాలుగా నాశనం చేశారని విమర్శించారు. అన్నింటి మీదా పన్నులు వేస్తున్నారని... చివరకు చెత్త మీద కూడా పన్నులు వేసి, చరిత్రలో చెత్త సీఎంగా జగన్ నిలిచిపోయారని చెప్పారు. డబ్బుతో గెలవాలని జగన్ భావిస్తున్నారని... ఆయన ఆశలు నెరవేరవని అన్నారు. కడుపుకు అన్నం తినే ఎవరైనా 175 సీట్లకు 175 గెలుస్తామని అంటారా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
Vishnu Kumar Raju
BJP
Jagan
YSRCP

More Telugu News