CM Jagan: సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

New Year celebrations at CM Jagan camp office in Tadepalli
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సరాది శోభ
  • కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
  • సీఎంకు విషెస్ తెలిపిన సీఎస్, డీజీపీ
  • సీఎం జగన్ కు వేదాశీర్వచనం అందించిన టీటీడీ అర్చకులు
తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర శోభ వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పెషల్ కేక్ కట్ చేశారు. అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్, ఇతర ఉన్నతాధికారులు సీఎం జగన్ ను కలిసి ఆయనకు విషెస్ తెలిపారు. ఈ క్రమంలో, తిరుమల నుంచి వచ్చిన టీటీడీ అర్చకులు సీఎం జగన్ కు వేదాశీర్వచనం అందించారు. స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డైరీలను సీఎం జగన్ కు అందించారు. కొత్త సంవత్సరాది నేపథ్యంలో, సీఎం కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర వైసీపీ నేతలు భారీగా తరలివస్తున్నారు.
CM Jagan
New Year-2024
Celebrations
Camp Office
Tadepalli
YSRCP
Andhra Pradesh

More Telugu News