Allu Arjun: నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ అల్లు అర్జున్ ట్వీట్

Allu Arjun Tweet On New Year Wishes And Recall 2023
  • ఎంతో కృతజ్ఞతతో వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడి
  • విలువైన పాఠాలు నేర్చుకున్నానంటూ బన్నీ ట్వీట్
  • 2023 తనకు ఎంతో అద్భుతమైన ఏడాదన్న స్టైలిష్ స్టార్

2023 నిజంగా తనకెంతో అద్భుతమైన ఏడాది అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. గతేడాది తన జీవిత ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా బన్నీ ధన్యవాదాలు తెలిపారు. ఎంతో కృతజ్ఞతతో 2023 కు వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఏడాది సందర్భంగా తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు.. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు బన్నీ చేసిన ట్వీట్ లో ఏముందంటే..

‘2023లో నా అద్భుత ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. 2023 నాకు అన్ని విధాలుగా ఒక అద్భుమైన ఏడాది. ఈ ఏడాది చాలా విలువైన పాఠాలను నేర్చుకున్నా. 2023కు ఎంతో కృతజ్ఞతతో వీడ్కోలు పలుకుతున్నా. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూఇయర్ 2024’ అని పేర్కొన్నారు.  2023లో బన్నీ కెరీర్ అద్భుతంగా కొనసాగింది. గతేడాది విడుదలైన పుష్ప సంచలన విజయం నమోదు చేయడంతో పాటు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తెచ్చిపెట్టింది. తెలుగు సినిమా చరిత్రలో ఈ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు.

  • Loading...

More Telugu News