Ana Konidela: నూతన సంవత్సరాది సందర్భంగా తన మంచి మనసు చాటుకున్న పవన్ అర్ధాంగి

Pawan Kalyan wife Ana Konidela celebrates new year eve in an orphanage in Hyderabad
  • నారపల్లిలో ఓ అనాథ శరణాలయాన్ని సందర్శించిన అనా కొణిదెల
  • అనాథ బాలలతో నూతన సంవత్సర వేడుకలు
  • కేక్ కట్ చేసి వారితో ఉత్సాహంగా గడిపిన పవన్ అర్ధాంగి
  • ఐదుగురు బాలికల స్కూలు ఫీజు అందించిన వైనం
  • అనాథాశ్రమానికి కావాల్సిన సరుకుల అందజేత
జనసేనాని, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అర్ధాంగి అనా కొణిదెల ఇటీవల క్రిస్మస్ సందర్భంగా హైదరాబాదులోని ఓ అనాథ శరణాలయాన్ని సందర్శించి అక్కడి చిన్నారులతో వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నూతన సంవత్సరాది సందర్భంగానూ ఆమె తన మంచి మనసు చాటుకున్నారు. 

హైదరాబాద్ నారపల్లి ప్రాంతంలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన  అనాథ శరణాలయాన్ని సందర్శించారు. తమకంటూ ఎవరూ లేని అనాథ బాలలతో ముచ్చటించి వారిలో ఆనందం నింపారు. వారి విద్యాభ్యాసం గురించి తెలుసుకున్నారు. కేక్ కట్ చేసి వారితో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. 

అంతేకాదు, ఐదుగురు బాలికలకు స్కూలు ఫీజు చెల్లించాల్సి ఉందని తెలుసుకున్న అనా కొణిదెల అందుకు అవసరమైన మొత్తాన్ని అక్కడిక్కడే అందించారు. అనాథ శరణాలయానికి అవసరమైన నిత్యావసరాలను పెద్ద మొత్తంలో సమకూర్చారు. అనాథ బాలలకు అవసరమైన వస్తువులను కూడా అందించారు.
Ana Konidela
New Year-2024
Orphanage
Hyderabad
Pawan Kalyan
Janasena

More Telugu News