Pawan Kalyan: గతం అందించిన అనుభవాలతో కొత్త ఏడాదిలో ముందుకు సాగాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes people in new year eve
  • ప్రజలకు జనసేనాని నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • 2024లో ఏపీ ప్రజలు తీసుకునే నిర్ణయం మేలు మలుపు కావాలని ఆకాంక్ష
  • ప్రజా నిర్ణయం కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని వెల్లడి

నూతన సంవత్సరాది సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. "కొత్త ఆకాంక్షలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతం అందించిన అనుభవాలతో కొత్త ఏడాదిలో ముందుకు సాగాలి. 2024 సంవత్సరంలో ఏపీ ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్ర పురోగతికి మేలు మలుపు కావాలి. ప్రజా నిర్ణయం కచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, శాంతిభద్రతలపై ప్రభావం చూపిస్తుంది. 2024 సంవత్సరంలో అందరిలో కొత్త ఉత్సాహాన్ని, సుఖ సంతోషాలను అందించాలని కోరుతున్నాను" అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News