Sydney: సిడ్నీలో కళ్లు చెదిరే బాణసంచా విన్యాసాలతో నూతన సంవత్సర వేడుకలు... వీడియో ఇదిగో!

Sydney welcomes new year 2024 in a grand style
  • కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా
  • 2024ను ఆహ్వానిస్తూ సిడ్నీలో అంబరాన్నంటిన సంబరాలు
  • సిడ్నీ హార్బర్, ఓపెరా హౌస్ వద్ద అత్యంత ఘనంగా వేడుకలు
ప్రపంచదేశాలు ఒక్కొక్కటిగా నూతన సంవత్సరాదిని ఆహ్వానిస్తున్నాయి. 2024లోకి అడుగుపెట్టే క్షణాలను అత్యంత వేడుకగా జరుపుకుంటున్నాయి. ఆస్ట్రేలియా నగరం సిడ్నీలోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కళ్లు చెదిరేలా నిర్వహించారు. ఇక్కడి ప్రఖ్యాత సిడ్నీ హార్బర్, ఓపెరా హౌస్ వద్ద చేపట్టిన బాణసంచా, లైటింగ్ విన్యాసాలు అదరహో అనిపించాయి. ప్రజలు పెద్ద ఎత్తున సిడ్నీ హార్బర్ వద్దకు విచ్చేసి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రతి ఏడాది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సిడ్నీ నగరం సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఎందుకు టాప్ లో ఉంటుందో నేటి వేడుకలు చూస్తే అర్థమవుతుంది.
Sydney
New Year
2024
Celebrations
Australia

More Telugu News