Sheena Chohan: 'అమర్-ప్రేమ్' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: షీనా చోహన్

Actress Sheena Chohan says she is eagerly waiting for her new movie release
  • తాజాగా అమర్-ప్రేమ్ చిత్రంలో నటించిన షీనా చోహన్
  • 2024లో విడుదల కానున్న చిత్రం
  • తొలుత జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శన
  • ఆపై థియేటర్లలో విడుదల
  • త్వరలో తెలుగులోనూ నటించనున్న షీనా
  • ఓటీటీల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి
ప్రముఖ నటి షీనా చోహన్ తన నూతన చిత్రం 'అమర్-ప్రేమ్' పూర్తి చేసి విజయవంతంగా 2023 ఏడాదికి గుడ్ బై చెప్పనున్నారు. ముక్కోణపు ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించిన 'అమర్-ప్రేమ్' వచ్చే ఏడాది ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది. 

జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సువేందు రాజ్ ఘోష్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తొలుత జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత థియేటర్లలో విడుదల కానుంది. 

దీనిపై కథానాయిక షీనా చోహన్ మాట్లాడుతూ... "ఈ చిత్రంలోని పాత్ర నా హృదయానికి దగ్గరైంది. జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శనలు త్వరలో ప్రారంభమవుతాయి, ఆ తర్వాత థియేట్రికల్ విడుదల ఉంటుంది. ఇది ఒక భావోద్వేగ ప్రయాణం" అని చెప్పుకొచ్చారు. షీనా చోహన్ త్వరలో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు జయరాజ్ దర్శకత్వం వహించిన 'ది ట్రైన్' అనే మలయాళ చిత్రం ద్వారా ఆమె తెరపైకి వచ్చారు. ఈ చిత్రంలో మమ్ముట్టి కథానాయకుడు. 

నెట్‌ఫ్లిక్స్‌లో "యాంట్ స్టోరీ"తో ఆమె పెద్ద విజయాన్ని అందుకున్నారు. మోస్తోఫా సర్వర్ ఫరూకీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దుబాయ్, షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి గాను షీనా చోహన్ ఉత్తమ నటిగా నామినేషన్ పొందింది. 

షీనా త్వరలో టారన్ లెక్ట్సన్ హాలీవుడ్ చిత్రం ‘నో మాడ్’తో అందరినీ పలకరించబోతోన్నారు. ఒక నటిగా షీనా మంచి కథలను ఎంచుకుంటూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లోనూ షీనా అభిమానుల్ని సంపాదించుకున్నారు.

తన సినిమాలతో, తన పాత్రలతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. ఢిల్లీ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్‌లో ఆమె ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ అవార్డులు గెలుచుకున్న దర్శకుడు బుద్ధదేబ్ దాస్‌గుప్తా చేసిన ప్రాజెక్టులోని ఆమె నటనకు గానూ 'ఇట్ గర్ల్' అనే బిరుదు వచ్చింది. ఓటీటీలో మాధురీ దీక్షిత్, కాజోల్ వంటి ప్రముఖులతో నటించి షీనా తనదైన ముద్ర వేశారు. 

బప్పాదిత్య బంధోపాధ్యాయ దర్శకత్వం వహించిన ఇండిపెండెంట్ ఫీచర్ ఫిల్మ్ 'జస్టిస్' రాబోయే సంవత్సరంలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శితం కానుంది. 'ఎక్స్ మేట్స్'లో ఆమె నటనకు గానూ అవార్డులు గెలుచుకున్నారు. 

ఆదిత్య ఓం దర్శకత్వంలో బయోపిక్ స్టార్ సుబోధ్ భావే సరసన కథానాయికగా హిందీ బయోపిక్ ఫీచర్ ఫిల్మ్ ‘సంత్ తుకారాం’ షూటింగ్ కూడా పూర్తి చేశారు. 2024లో షీనా నటించిన నాలుగు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
Sheena Chohan
Amar-Prem
Actress
New Movie
India

More Telugu News