Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డితో స్నేహంపై కోమటిరెడ్డి పాట.... వీడియో ఇదిగో!

Komatireddy Venkat Reddy friendship song on CM Revanth Reddy
  • గతంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య విభేదాలు!
  • ఎన్నికల వేళ చిగురించిన పాత స్నేహం
  • కలిసి కదం తొక్కిన కాంగ్రెస్ అగ్రనేతలు
  • రేవంత్ ముఖ్యమంత్రి... కోమటిరెడ్డి మంత్రి అయిన వైనం
ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకు తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భిన్న ధ్రువాల్లా వ్యవహరించడం అందరికీ తెలిసిందే! ఇద్దరికీ పొసగడంలేదని మీడియాలో కథనాలు వచ్చేవి. కానీ అసెంబ్లీ ఎన్నికలతో పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలందరూ విభేదాలు పక్కనబెట్టి, కలసికట్టుగా కదం తొక్కి, పార్టీని గెలిపించుకున్నారు. ఆపై రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి అయ్యారు. 

ఇప్పుడు కోమటిరెడ్డి... రేవంత్ పట్ల స్నేహగీతం ఆలపిస్తున్నారు. రేవంత్ తో తన దోస్తీపై ఆయన నిజంగానే ఓ పాట విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు. తామిద్దరి మధ్య ఉన్న స్నేహానుబంధాన్ని కోమటిరెడ్డి కవితాత్మకంగా వివరించే ప్రయత్నం చేశారు. 

వేగమొకడు... త్యాగమొకడు
గతము మరువని గమనమే

ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే
ఒకరు గర్జన... ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే

సైగ ఒకరు... సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే...
ఒకడు చిచ్చురా... ఒకడు తెమ్మెర
కలిసి దహనాలే...

స్నేహమే ఇదిలే... నూరేళ్లు నిలవాలే

...అంటూ ఈ స్నేహగీతం సాగుతుంది.
Komatireddy Venkat Reddy
Revanth Reddy
Friendship
Song
Congress
Telangana

More Telugu News