ఎమ్మెల్యే కేతిరెడ్డి వాహనం ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు
- ముదిగుబ్బ మండలంలో యాక్సిడెంట్
- బైక్ ను ఢీ కొట్టిన ఎమ్మెల్యే ఎస్కార్ట్ జీప్
- బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే ఆదేశాలు
మొలకవేమల క్రాస్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎస్కార్ట్ వాహనం ఢీ కొట్టింది. దీంతో నారాయణ నాయక్, పీకానాయక్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు.. వారిద్దరినీ కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గాయపడిన ఇద్దరికీ చికిత్స అందిస్తున్నారు. ఎస్కార్ట్ వాహనం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి విచారించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేశారు.