Hyderabad Metro: నూతన సంవత్సర వేడుకలు.. నగర వాసులకు మెట్రో గుడ్ న్యూస్

Hyderabad Metro to run services till midnight today new year
  • నేటి అర్ధరాత్రి వరకూ మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయన్న సంస్థ ఎండీ 
  • చివరి రైలు అర్ధరాత్రి 12.15 గంటలకు టర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతుందని వెల్లడి
  • ప్రయాణికులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచన
నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న నగరవాసులకు హైదరాబాద్ మెట్రో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి అర్ధరాత్రి వరకూ మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. చివరి సర్వీసులు టర్మినల్ స్టేషన్‌ల నుంచి అర్ధరాత్రి 12.15 గంటలకు బయలుదేరి గమ్యస్థానాలకు చేరుకుంటాయని మెట్రో ఎండీ తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యేక భద్రతా చర్యలు కూడా తీసుకున్నట్టు చెప్పారు. మెట్రో రైలు, స్టేషన్‌లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని పేర్కొన్నారు. మెట్రో స్టేషన్‌లోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక చేశారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు.
Hyderabad Metro
Hyderabad
New Year Celebrations

More Telugu News