Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను కలిసిన కాకినాడ పార్లమెంటు స్థానం పరిధి టీడీపీ ఇన్చార్జ్ లు

TDP incharges in Kakinada Parliament segment met Pawan Kalyan
  • ఏపీలో రాజుకుంటున్న ఎన్నికల వేడి 
  • కాకినాడలో మకాం వేసిన పవన్ కల్యాణ్
  • పొత్తు నేపథ్యంలో పవన్, టీడీపీ నేతల సమావేశం
ఏపీలో ప్రధాన పార్టీల హడావిడితో ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. ప్రస్తుతం జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అదే పని మీద కాకినాడలో మకాం వేశారు. ఆయనను ఇవాళ కాకినాడ పార్లమెంటు స్థానం పరిధిలోని వివిధ నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జ్ లు, ముఖ్య నేతలు కలిశారు. 

కాకినాడ పార్లమెంటు పరిధిలో గెలుపే లక్ష్యంగా జనసేన, టీడీపీ కలిసి ముందుకు సాగాలని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు. తమ మూడు రోజుల సమీక్షకు సంబంధించిన వివరాలను కూడా పవన్ వారితో పంచుకున్నట్టు తెలుస్తోంది. 

ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో వెల్లడించింది. పవన్ తో టీడీపీ ఇన్చార్జ్ లు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని వివరించింది.
Pawan Kalyan
TDP Incharges
Kakinada
Janasena
Telugudesam
Andhra Pradesh

More Telugu News